Home South Zone Andhra Pradesh కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి |

కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి |

0
0

ప్రచురణార్థం 19 డిసెంబర్ 2025 **జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులవేతనాలు వెంటనే చెల్లించాలి ….. బోయి సత్యబాబు ,సిపిఎం ఫ్లోర్ లీడర్ విజ్ఞప్తి ……. విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ నందు పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలను ప్రవేట్ కాంటాక్ట్స్ సంస్థల వారు చెల్లించకపోవడం కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నగర పాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి కార్మికుల వేతనాలు చెల్లించే దానికి కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ హెచ్ఎం ధ్యానచంద్ గారికి ఈరోజు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు .

జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో M/Sయశ్వంత్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ వారు కార్మికులకు నవంబర్ నెల వేతనము ,పిఎఫ్ ,ఈఎస్ఐ నిధులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారు .అలాగే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు అక్టోబర్ నెల వేతనం M/Sయశ్వంత్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ వారు మరియు నవంబర్ నెల వేతనం M/S కనకదుర్గ మాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థల వారు వేతనాలు చెల్లించక పోవడం వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు .

డిసెంబర్ 20వ తేదీ కూడా రావడం అక్టోబరు &నవంబరు రెండు నెలల వేతనం చెల్లించకపోవడం కార్మికుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు.కార్మికుల వేతనం గురించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దృష్టికి పలుమార్లు కార్మికుల ద్వారా తీసుకు వెళ్లినప్పటికీ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలు వారు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని వారు పేర్కొన్నారు .

నగరపాలక సంస్థ అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థల పట్ల ఉదార స్వభావం వీడి కార్మికులకు న్యాయంగా ఇవ్వవలసిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 36 తేదీ 01-03- 2024 ప్రకారము మరియు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం నెలవేతనం రూపాయలు 21000/- ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వేతనాలు చెల్లించే విధంగా తగిన కృషి చేయాలని వారు పేర్కొన్నారు

.ఈరోజు నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ అర్జున్ రావు గారు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్ గారు సదరు కాంట్రాక్టు సంస్థ నుండి వేతనాలు సాయంత్రంలోగా చెల్లించే విధంగా తగిన కృషి చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు **అభివందనంతో** బోయ సత్యబాబు -సిపిఎం ఫ్లోర్ లీడర్ ..సెల్ నెంబర్ 9490098409 ప్రకారం సకాలంలో చెల్లించే విధంగా

NO COMMENTS