*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*
*అరెస్టు లను నిరసిస్తూ రాజధానిలో నిరసన గళం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు*
*కార్మికుల నిరసన ల లో పాల్గొని మాట్లాడిన రాజధాని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు ఎం రవి*
*రాజధాని లోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, నిడమర్రు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, తదితర గ్రామాల్లో పని విరామ సమయాల్లో*
*నెల్లూరు మున్సిపల్ కార్మికుల పై లాఠీ చార్జి కి నిరసన తెలిపిన పారిశుద్ధ్య కార్మికులు*
శాంతియుతంగా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ అధికారులకు అర్జీ అందజేసేందుకు వస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్మికులపై గురువారం నాడు వందలాదిమంది పోలీసులు లాఠీచార్జి చేయడం వల్ల పలువురు మహిళ మున్సిపల్ కార్మికులు గాయపడ్డారని, మహిళా కార్మికుల పట్ల మగ పోలీసులు దురుసుగా వ్యవహరించా రని
63 మంది కార్మికులను అరెస్టు చేసి ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని రవి తెలిపారు
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు కొనసాగిస్తున్న విధంగా, తమకు కూడా 62 సంవత్సరాలు రిటైర్మెంట్ కొనసాగించాలని
అలా కాని పక్షంలో తమ స్థానంలో డిగ్రీలు చదివి పని దొరక్క ఖాళీగా ఉంటున్న తమ పిల్లలకైనా చెత్త ఎత్తే పనైన ఇవ్వమని అడగటం మున్సిపల్ కార్మికులు చేసిన నేరమా అని రవి ప్రశ్నించారు
గత సమ్మె కాలపు వేతనాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపమని కార్మికులు కోరితే పోలీసులతో లాఠీచార్జి జరిపిస్తారా
ఇది ఎక్కడ న్యాయమని రవి అన్నారు
సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
ఇలా కాలో మున్సిపల్ కార్మికులపై పోలీసులు విరుచుకుపడటం చూస్తుంటే
కార్పొరేట్ ల మెప్పు కోసం కార్మికులను అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని అన్నారు
పోలీసులతో కార్మిక వర్గాన్ని అణిచివేయాలని చూస్తే కార్మికులంతా సంఘటితమై తగిన గుణపాఠం నేర్పితేరుతారని రవి హెచ్చరించారు
