ప్రచురణార్ధం
*విజయవాడ నగరంలో వీధివిక్రయదారులకి గుర్తింపు కార్డులు వెండింగ్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలి ….జి.కోటేశ్వరరావు డిమాండ్*
విజయవాడ బీసెంట్ రోడ్డు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద భారత రెడీమేడ్ ఫ్యాన్సీ & చెప్పల్స్ హాకర్ యూనియన్ ను ఏఐటీయూసీ కి అనుబంధముగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ అధ్యక్షులు ఎస్.కె. సాబీర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ముఖ్య అతిధిగా పాల్గొని పతాకావిష్కరణ చేయటం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వీధి విక్రయదారుల చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు విడుదల చేసి 12 సంవత్సరాలు దాటిన విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ వారు మరియు నగర పోలీస్ శాఖ వారు ఆ చట్టాల అమలు చేయడంలో అధికార యంత్రంగం పూర్తిగా విఫలమైంది నగరవ్యాప్తంగా వీధి విక్రయదారులపై పోలీసులు అక్రమంగా పెట్టి కేసులు బనాయిస్తు వేధింపులకు గురిచేస్తున్నారు.
మరో పక్క నగర పాలక సంస్థ అధికారులు, పోలీసులు కొద్దిపాటి వ్యాపారం సాగించోటల్లా అద్దాంతరంగా తొలగించడం వంటి చర్యలు కారణంగా చిరువ్యాపారాలు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారని , పెద్దపెద్ద బడా వ్యాపారస్తులకు కొమ్ముకాస్తూ వీధి విక్రయదారుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నగరంలో ఉన్న 64 డివిజన్ల పరిదిలో వేలాది మంది వీధి.
విక్రయాల ద్వారా అనేక సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారని, వీరితో పాటు నగరం రాజధాని కేంద్రంగా మరీనా తరువాత వలస విక్రయదారులు అనేక మంది బతుకుతెరువుకు నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్నారని కనీస హక్కులపై అవగాహనా లేక సరైన ఉపాధి లేక అనేక మంది అర్దాకలితో అలమటిస్తున్నారని. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు వీధి విక్రయదారుల చట్టాలను అమలుచేసి వారికీ జీవన భద్రతా కల్పించాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు.
ఈ సందర్భముగా నగర ఏఐటీయూసీ కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ భారత రెడీమేడ్ ఫ్యాన్సీ & చెప్పల్స్ హాకర్ యూనియన్ ను ఏఐటీయూసీ కి అనుబంధముగా ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో వీరి సమస్యల సాధనలో ఎల్లవేళలా ఏఐటీయూసీగా పూర్తి సహాయసహకారాలు అందిస్తూ ముందుండి నడిపించడం జరుగుతుంది అని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం హ్యాకర్స్ పై వేధింపులను మానుకోవాలని, పెద్ద వ్యాపారుల దగ్గర చిన్నగా, చిన్న వ్యాపారుల దగ్గరా పెద్దగా నిబంధలను అమలు చేసే విధానాన్ని వీడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటియుసి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు గారు మరియు విజయవాడ నగర ఏఐటీయూసీ అధ్యక్షులు కె.ఆర్.ఆంజనేయులు, హర్కార్స్ యూనియన్ నాయకులు క్రిష్ణ, సైదారావు మల్లేశ్వరి, స్థానిక యూనియన్ ప్రధాన కార్యదర్శి వి మధుసూదన్ రావు మరియు సభ్యులు, సిపిఐ నాయకులు కొండేటి శ్రీనివాసరావు, బత్తుల తిరుపతయ్య, పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.




