Home South Zone Andhra Pradesh ఇంద్రకీలాద్రిలో నిత్య పూజలకు భారీ భక్తుల రద్దీ |

ఇంద్రకీలాద్రిలో నిత్య పూజలకు భారీ భక్తుల రద్దీ |

0

*పత్రికా ప్రకటన*

*ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*

పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

అమావాస్య,శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు.
సుప్రభాత సేవ,ఖడ్గమాలార్చన,
లక్ష కుంకుమార్చన, చండీ యాగం, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం, అష్టోత్తరం, సహస్ర నామం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు.

శుక్రవారం రద్దీ సందర్బంగా ప్రతీ ఒక్క భక్తునికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలని ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వార్ల ఆదేశాలకనుగుణంగా దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉదయం నుండే రూ. 500/- టిక్కెట్ అంతరాలయ దర్శనం క్యూ వేగం గా,
వివిధ దర్శనం క్యూలైన్లు కూడా వేగంగా నడిచేలా చర్యలు తీసుకోవడమైనది.
వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత లడ్డు ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.

ఉచిత లడ్డు ప్రసాద వితరణ నిరంతరం కొనసాగింది.ఉపాలయాలలో భక్తుల రద్దీ కి తగ్గట్లు ఏర్పాట్లు చేయడమైనది.దేవస్థానం సిబ్బంది, సేవాదారుల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుని భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయడమైనది.
ఆన్లైన్ సేవల పెంపుదల, డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. కేశ ఖండన టిక్కెట్, ప్రసాదాల కొనుగోలు, దర్శనం టికెట్, విరాళాలు చెల్లింపులు సైతం ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version