*Press Note*
*Eagle Operation on Ganja Hotspots*
*EAGLE Team, Vijayawada*
Date: 19 12 2025వ తేదీన గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని పడమట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న హనుమాన్ నగర్ ప్రాంతంలో గల Hotspots లను JCB తో తొలగించడం జరిగింది. ఈ hotspots లో గంజాయికి బానిసలుగా మారిన యూవకులు వచ్చి నిరంతరం గంజాయి సేవిస్తూ ఆకాతాయి పనులు చేస్తూ స్థానిక ప్రజలని ఇబ్బందికి గురించేసేవారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ ఈగల్ టీం స్థానిక పోలిసుల సహకారం తో గంజాయి సేవించటానికి అనుకూలంగా ఉన్న hotspot ను JCB తో జంగల్ క్లియరెన్స్ చేయటం జరిగింది.
ఇకమీదట ఈగల్ IGP గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని hotspot లను CP శ్రీ రాజశేఖర్ బాబు IPS గారి, కలెక్టర్ శ్రీ లక్ష్మీషా IAS గారి సహకారంతో తొలగించడం జరుగుతుంది అని తెలియపారుస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఇన్స్పెకర్స్ శ్రీ M.రవీంద్ర గారు మరియు D. నాగార్జున గారు ఈగల్ SIs M.వీరాంజనేయులు గారు మరియు P.రాంబాబు గారు పడమట ఎస్సై డి అనుష గారు,ఈగల్ టీం సభ్యులు పాల్గొనడం జరిగింది
