కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..
టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు తల్లి వెంకట నరసమ్మ కు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాళులు అర్పించారు..
అనారోగ్యం కారణంగా ఇటీవల వెంకట నరసమ్మ తనువు చాలించారు.. శనివారం పెద అవుటుపల్లి లోని కంభంపాటి నివాసానికి వెళ్లిన సుజనా చౌదరి కంభంపాటి వెంకట నరసమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.. అనంతరం రామ్మోహనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు..




