పత్రికా ప్రకటన
ఇంద్రకీలాద్రి, 19 డిసెంబర్ 2025
➖ *విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి.*
➖ శ్రీ అమ్మవారి దర్శనముకు వెళ్లే ముందు భక్తులతో మాట్లాడిన మంత్రి.
ఆన్ లైన్ సేవలు, భక్తుల సంతృప్తి స్థాయి తెలుసుకున్న మంత్రి.
అన్ని ఏర్పాట్లు బాగున్నాయని తెలిపిన భక్తులు.
➖మంత్రివర్యులకు వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధా కృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు.
శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.
➖ *అనంతరం* ఈవో ఛాంబర్లో – దేవాలయంలో నగదు రహిత సేవల స్థాయి, ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా భక్తుల సంతృప్తి స్థాయి, ఆన్ లైన్ సేవలు పెంపుదల గురించి ఆలయ ఈవో నుండి వివరాలు తెలుసుకున్న మంత్రివర్యులు.
➖గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో ఆన్ లైన్ సేవలు భక్తులకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు శ్రీ బడేటి ధర్మారావు, శ్రీ పి. రాఘవ రాజు, శ్రీ ఎ. శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.




