Home South Zone Andhra Pradesh కాలుష్య రహిత నగరానికి మరో అడుగు |

కాలుష్య రహిత నగరానికి మరో అడుగు |

0
0

విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

*19-12-2025*

*కాలుష్య రహిత నగరానికి మరో అడుగు*

*కాలుష్యం నియంత్రించే దిశగా వర్క్ షాప్*

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు మేరకు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం ఉదయం నేషనల్ క్లీన్ ఎయిర్ పాలసీలో భాగంగా కాలుష్య నియంత్రణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు విజయవాడ నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వన్ టౌన్ లో క్లీన్ ఎయిర్ క్వాలిటీని అధ్యయనం చేశారని, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పరిశోధన ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నేషనల్ క్లీన్ ఎయిర్ పాలసీ లో భాగంగా నిర్వహించిన వర్క్ షాప్ లో ముందుగా కాలుష్యానికి అత్యంతగా లోనయ్యే ప్రాంతాల్లో గల వన్ టౌన్ లో నిపుణులు చేసిన పరిశోధనలో వారు పరిశీలించే అంశాలను వివరించారు.

ఈ వర్క్ షాప్ లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ నైనా గుప్త, డాక్టర్ ప్రశాంతి రావు, విఎంసి ఎన్విరాన్మెంట్స్ సిబ్బంది పాల్గొన్నారు.

*పౌర సంబంధాల అధికారి*

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

NO COMMENTS