అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్కూల్ వేదికగానే ముస్తాబు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు.
ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను సీఎం స్వయంగా పరిశీలించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.




