విజయవాడ నగరపాలక సంస్థ
19-12-2025
*ప్రతి ఒక్కరూ తమతోపాటు గుడ్డ సంచిని పెట్టుకోవాలి- మేయర్, రాయన భాగ్యలక్ష్మి*
ప్రపంచం లోనే విజయవాడ నగరపాలక సంస్థను సుస్థిరత్వానికి ఒక మోడల్గా ఉంచాలి- కమిషనర్ ధ్యానచంద్ర*
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనలో పరివర్తన రావాలని, ప్రతి ఒక్కరూ తమతోపాటు గుడ్డ సంచిని పెట్టుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ తమతో పాటు బయటకు వెళ్లేటప్పుడు తమ తో పాటు నిత్యావసర వస్తువుగా గుడ్డ సంచిని పెట్టుకుని బయటికి వెళితే ఎటువంటి వస్తువు వినియోగం చేసుకున్న ఆ సంచిలో పెట్టుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లల్లో మొక్కలను నాటుకోవాలని, మిద్దెల పైన కూరగాయలను పండించుకోవచ్చు అని, తద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ రాబోయే తరానికి మన ఇవ్వగలిగే ఆస్తి ప్రకృతి వనరులని, కావున పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని నిషేధిస్తూ, సుస్థిరత్వం సాధించడంలో విజయవాడ నగరపాలక సంస్థను ఒక మోడల్ గా ఉంచాలని అది భావితరాలకు మాత్రమే సాధ్యమని, అక్కడ వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల మూడు సర్కిళ్ళు, అన్నీ వార్డుల్లో, ప్రతి సచివాలయంలో కార్యక్రమం జరిపి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకటనారాయణ, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జై శ్రీనివాస్ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ






