Home South Zone Andhra Pradesh విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలి |

విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలి |

0
0

Press Note:
విజయవాడ.
19.12.2025.

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.

_ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం… RSU జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి డిమాండ్_

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలు ₹7,400 కోట్లను తక్షణమే విడుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్‌లో రివల్యూషనరి విద్యార్థి సంఘం (RSU) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి ఆ సంఘం జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 18 నెలలు పూర్తి అయినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల కళాశాలలు కేవలం రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్నాయని, సకాలంలో రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే కళాశాల మూతపడి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉందని అంతేకాదు, విద్యార్థులు చదువులు ఆగిపోయే అవకాశం ఉందన్నారు.

చదువు పూర్తి అయినా కూడా ఈరోజు కొంతమంది యాజమాన్యాలు సర్టిఫికెట్స్ అడుగుతుంటే, పూర్తిస్థాయి డబ్బులు చెల్లించి తీసుకుపోమని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఇవ్వాల్సిన ₹7,400 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు.

వేల కోట్ల రూపాయలు అనేక పథకాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

విద్యార్థుల జీవితాలను గందరగోళంలో పెట్టకుండా విద్యాశాఖ శాఖ మంత్రి గారు స్పందించి తక్షణమే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి యాజమాన్యం నుంచి వేదింపులు గురవుతున్న విద్యార్థులను వారి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ భారీ ధర్నా కార్యక్రమంలో RSU రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురాం రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి,నరేందర్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు నూకరాజు,సాయి, శ్రీకాంత్ చౌదరి,సూర్య,ఆదినారాయణ వివిధ జిల్లాల నాయకత్వం పాల్గొన్నారు

NO COMMENTS