పత్రికా ప్రకటన
*వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి*
గుంటూరు, డిసెంబరు 20 : గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen ‘Z’) పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో ప్రారంభించారు. జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సేవా కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా రూపొందించడం జరిగింది.
సులభంగా అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులకు అనుకూలమైన ప్రజా సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారిత, వినియోగదారుడి కేంద్రీకృత పరిష్కారాలను స్వీకరించడం ద్వారా యువతలో మారుతున్న అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా పోస్టల్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది. జెన్ జెడ్ పోస్టాఫీస్‌ను ప్రత్యేకంగా జనరేషన్ జెడ్ (Z) యువత అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో ఆధునిక వాతావరణం, డిజిటల్ చెల్లింపు సదుపాయాలు, సరళీకృత సేవల అందింపు విధానాలు, ఒకే చోట పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలను సమగ్రంగా పొందే అవకాశం ఉంటుంది.
*పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్*
* రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
* ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుంది.
* లేటెస్ట్ technology రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సులభంగా తెలుస్తుంది
* కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా కాకుండా ఈ కామర్స్ ప్లాట్ ఫాం గా మార్చాం
* ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నాం.
* సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులు కు దీటుగా పోస్టాఫీసు లను తయారు చేస్తున్నాం.
* మార్కెటింగ్ కోసం ఓ నిపుణుడుని ప్రత్యక అధికారిని నియమించాం.
* మానవ వనరులను సక్రమంగా వాడుకోవడం పై దృష్టి సారించాం.
* Gen Z పోస్టాఫీసు ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే
* రాష్ట్రంలో మూడు జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేశాం.
* దేశ వ్యాప్తంగా దాదాపు 50 జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు
* పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చులతో 89 శాతం జీతాలకు సరిపోతున్నాయి
* సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమాల వల్ల మేం ఎక్కువ చార్జీలు వసూలు చేయటం లేదు
* అందుకే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఆలోచిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.పి శ్రీదేవి, విట్ వైస్ ఛాన్సలర్ డా. పి అరుల్ మాజీవర్మన్, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, విట్ రిజిస్ట్రార్
ఎం.జగదీష్ చంద్ర, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. వి. ఉపేందర్, పోస్టల్ సూపరింటెండెంట్ మధుర వాణి, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




