కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.
