*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*
*టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*
*మంగళగిరి:*
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర (బాబి) అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రంగిశెట్టి నరేంద్ర మాట్లాడుతూ…
ఈ రోజు నుంచి మూడు రోజులపాటు నగరంలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియోరహిత నగరంగా మంగళగిరిని నిలిపేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఎవరైనా చిన్నారులకు వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించకుండా ఉంటే అటువంటి 0-5 సంవత్సరాలలోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలన్నారు. అవసరమైతే మొబైల్ బూత్ ల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
