Home South Zone Andhra Pradesh గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!

గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!

0

కర్నూలు :

త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్ న్యూ ఇయర్  గిఫ్ట్ లింకుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా  ఎస్పీ  విక్రాంత్  పాటిల్ విజ్ఞప్తి చేశారు. పండగ సీజన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ప్రారంభం అయ్యాయని నమ్మకం పలికి మోసాలకు పాల్పడుతున్నారని  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గిఫ్టుల పేరుతో సోషల్ మీడియా ఈ మెయిల్స్ లింకులు వస్తుంటాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు తెలియని నెంబర్ నుంచి వచ్చిన లింక్ లు ఓపెన్ చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ 1930లో ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా తెలియచేశారు.

NO COMMENTS

Exit mobile version