కర్నూలు:
డిసెంబర్ 31తో ‘SPREE’ పథకం ముగింపునమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) ‘Spree-2025’ పథకం ఈ నెల డిసెంబర్ 31తో ముగియనుంది. జూలై 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో సంస్థలు, కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఏపీలో సుమారు 2.5 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐసిలో చేరారని, దీంతో వారికి ఆరోగ్యసేవలు, సామాజిక భద్రత లభిస్తున్నాయని ESIC ఏపీ ప్రాంతీయ డైరెక్టర్ మల్ల రామారావు తెలిపారు. అలాగే, 2,000కు పైగా సంస్థలకు గత కాలపు బకాయిలు, పాత రికార్డుల పరిశీలన మినహాయింపుతో ఉపశమనం లభించిందన్నారు.
10 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలకు వర్తింపు 10 మందికిపైగా ఉద్యోగులు ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, మాన్పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు తదితర సంస్థలు తప్పనిసరిగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఈఎస్ఐసి అధికారులు సూచిస్తున్నారు.




