Home South Zone Andhra Pradesh డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS...

డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS |

0

డ్రగ్స్ వద్దు బ్రో – స్పోర్ట్స్ ముద్దు బ్రో – ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ, ఐపిఎస్*

*తేది*:21.12.2025
*స్థలం*: విజయవాడ

🛡️విజయవాడ పటమాటలోని ఫన్‌టైమ్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 10వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కార్యక్రమమునకు గౌరవ *ఐజీ శ్రీ అకే.రవికృష్ణ, ఐపిఎస్*.

ఈ సందర్భంగా ఐజీ గారు స్వయంగా టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత మరియు సమాజాన్ని కబళిస్తున్న డ్రగ్స్ మత్తు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు క్రీడలే సరైన ప్రత్యామ్నాయమని ఐజీ గారు తెలిపారు.

రాష్ట్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా నిలవాలని ఆయన కోరారు.

టేబుల్ టెన్నిస్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.

గంజాయి, డ్రగ్స్ పై సమాచారం ఉన్నచో ఈగల్ సామాజిక మాధ్యమాలైన *Facebook, Instagram, You Tube, X, Threads* యొక్క 🆔 *@eagleap1972* ద్వారా 24× 7 ఎపుడైనా సమాచారం అందించవచ్చు.

ఈగల్ వాట్స్ యాప్ నెంబర్ 📱 *8977781972*📱 24×7 ఎప్పుడైనా సమాచారం అందించవచ్చు

గంజాయి, 💉💊డ్రగ్స్ పై ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడతాయి.

NO COMMENTS

Exit mobile version