కర్నూలు :
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.
ఆదివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.




