Home South Zone Andhra Pradesh పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే!! |

పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే!! |

0
0

కర్నూలు : డోన్ :

డోన్ పట్టణంలోని K.V.S కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

పిల్లల ఆరోగ్యం సమాజ భవిష్యత్తుకు పునాది అని ఎమ్మెల్యే గారు పేర్కొంటూ, పోలియో వంటి ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రుడు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

NO COMMENTS