కర్నూలు :
తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో ప్రజల జీవితాలు మరింత మెరుగుపడతాయి అని కర్నూలు రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ , బిజినెస్ డెవలప్మెంట్ శ్రీ నాగ నాయక్ గారు పేర్కొన్నారు.
తపాలా శాఖ వారి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీస్ ను సందర్శించిన సందర్భంగా, పోస్టల్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు మరియు సమావేశం నిర్వహించి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన తపల జీవిత బీమా పథకాన్ని పోస్టుమెన్లు అందరూ కూడా తమ విధుల్లో భాగంగా ప్రజలకు ఇన్సూరెన్స్ వివరాలను తెలియజేస్తూ ప్రజల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించవలసిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పోస్టల్ చూపులు అంటే జనార్దన్ రెడ్డి గారు, సిబ్బంది పాల్గొన్నారు.






