Monday, December 22, 2025
spot_img
HomeEntertainmentయావరేజ్ బ్యూటీ నుంచి పాన్ ఇండియా స్టార్ |

యావరేజ్ బ్యూటీ నుంచి పాన్ ఇండియా స్టార్ |

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు.

చాలా మంది హీరోయిన్స్ ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతూ ఉంటారు. కెరీర్ బిగినింగ్ లో యావరేజ్ గా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు అందాల బొమ్మలుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలకు కొదవే లేదు నిత్యం పదుల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక స్టార్ హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అభిమానులను ఆకట్టుకునేలా ఫోటో షూట్స్ తో కవ్విస్తున్నారు. కొంతమంది దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షించేలా క్రేజీ ఫోటో షూట్స్ చేసి నెటిజన్ అవాక్ అయ్యేలా చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సందర్భం ఏదైనా సరే ఆ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులు తెగ పంచుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? టక్కున గుర్తుపట్టలేరు కానీ ఆమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతుంది ఆ అమ్మడు.. అలాగే ఈ చిన్నది ఓ స్టార్ హీరో కూతురు.

ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా హీరోయిన్ శ్రుతిహాసన్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. అనగనగ ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది శ్రుతిహాసన్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.

ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శ్రుతి హాసన్ లుక్ డిఫరెంట్ గా ఉండేది. ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. అయితే ఆమె పై గతంలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కాగా తన ముక్కుకు చిన్నప్పుడు గాయం అయ్యింది. అందుకే సర్జరీ చేయించుకున్నా అని తెలిపింది శ్రుతిహాసన్.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments