Home South Zone Andhra Pradesh రేపు ప్రారంభం మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 |

రేపు ప్రారంభం మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 |

0
2

రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్

నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు

మంత్రి నారా లోకేష్ సూచనలతో టోర్నమెంట్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు

మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో డిసెంబర్ 21 తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు జరగనున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ యొక్క ఏర్పాట్లను టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు.

క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహణ, ప్లే గ్రౌండ్ లెవలింగ్, క్రికెట్ పిచ్‌, తాగునీటి సదుపాయం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సూచనలతో టోర్నమెంట్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

క్రీడాకారులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. టోర్నమెంట్‌లో 128 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రీమియర్ లీగ్ సిజన్-4 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ 3 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష నగదును బహుమతులు ప్రధానం చేస్తారన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో వివిధ రకాల టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. నియోకవర్గంలో విద్యతో పాటు క్రీడలను పోత్సహించండం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఏపీని క్రీడారంగంగా తీర్చిదిద్దటమే మంత్రి నారా లోకేష్ ధ్యేయమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇంటి స్థలంతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నారని చెప్పారు. క్రీడాకారుల్లో నూతనోత్సాహాన్ని నింపేలా కూటమి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లకు కొత్త క్రీడా విధానం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

NO COMMENTS