Home South Zone Andhra Pradesh సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు |

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు |

0

డిసెంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన, వాడవాడలా సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు జయప్రదం చేయండి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు

చారిత్రక భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ సంబరాలు అంబరాన్ని తాకాలి

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం, అనంతరం ప్రజా సమస్యల పరిష్కారం, అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టింది సిపిఐ

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తోంది

‘దున్నేవానికే భూమి’ అని నమ్మి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసింది

సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో రాజ్యాంగ రక్షణ, లౌకిక రాజ్య పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నది

పాలకుల ప్రజా వ్యతిరేక, అనాలోచిత, మతోన్మాద విధానాలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది

సిపిఐ శతవసంతాల ముగింపు సందర్భంగా ప్రతి పార్టీ శాఖలో 100 జెండాలు ఎగరేసి, 100 మొక్కలను నాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం
– గుజ్జుల ఈశ్వరయ్య,
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

NO COMMENTS

Exit mobile version