Home South Zone Andhra Pradesh సీఎం చంద్రబాబు అవార్డుకు టీడీపీ శ్రేణుల సంబరం |

సీఎం చంద్రబాబు అవార్డుకు టీడీపీ శ్రేణుల సంబరం |

0

చంద్రబాబుగారికి వచ్చిన అవార్డు పట్ల తెదేపా శ్రేణుల పాలాభిషేకం..లుక్కా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలతో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు గారి చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు పాలాభిషేకం చేశారు.
లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడి సుమారు 18 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకి 18 గంటలకు పైగా అహర్నిశలు కష్టపడుతున్నారు.

గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన విధ్వంసకర పాలన, లక్షల కోట్ల అప్పులతో ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి అందరికీ తెలిసిందేనని, ఉద్యోగస్తులకు ,పెన్షనర్ల కు ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, రైతులకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన వైనం.

అమరావతి రాజధానిని చంపేసి, భూములు ఇచ్చిన రైతులను ఐదు సంవత్సరాలు ఏడిపించిన దుస్థితి, రాష్ట్రానికి జీవనాడైనా పోలవరాన్ని కూడా పడుకోబెట్టిన పరిస్థితుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్వసక్తితో, తన ఆలోచనలతో ఉద్యోగస్తులకు ప్రతినెల జీతాలు.

పోలవరాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించే పరిస్థితికి, అమరావతి రాజధాని మరల ప్రాణం పోసిన పరిస్థితిని దేశ ప్రజలు అందరూ చూశారని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులను ఆకర్షించుటకు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి.

తనపై నమ్మకం ఉన్న పారిశ్రామికవేత్తల నుండి దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించారన్నారు. ప్రకటించిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ తో సహా ప్రజలకు నిరాటంకంగా అందిస్తున్నారన్నారు.

ముందుచూపు, సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం కేంద్ర జిడిపి కంటే రాష్ట్ర జిడిపి చాలా ఎక్కువగా ఉండేలా చేశారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరానికి ఎకనామిక్ టైమ్స్ వారిచే నియమింపబడిన మేధావి వర్గం నిశితంగా పరిశీలించి చంద్రబాబు గారి సమర్థత పట్ల,నమ్మకంతో “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డు ప్రకటించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నామని లుక్కా అన్నారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మసిముకు శ్రీనివాస్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడసాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి బత్తుల దుర్గారావు, యార్లగడ్డ రమేష్, మల్లెల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version