భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని కమ్యూనిస్టు బొమ్మలు సెంటర్లో శంకర కంటి వైద్యశాల వారి సహకారంతో అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు ఈ విధమైనటువంటి ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహిస్తూ అట్టడుగు ప్రజానీకానికి మరింత చేరవుతున్నదని వారు తెలిపారు.
ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని భారత దేశ రాజ్యాంగంలో కూడా అదే పొందుపరిచి బడినదని కానీ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి ఆలోచనలతో విద్య,వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో భాగంగా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి వైద్యుల బృందం ప్రజలకు బిపి,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, నగర సమితి సభ్యులు చినపోతుల వెంకటరావు, అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభినందనలతో,
ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ కార్యదర్శి, గుంటూరు నగర సమితి
#Johnbaji.




