Home South Zone Telangana జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ |

జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ |

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో నిర్వహించిన (7-20 ఏజ్ గ్రూప్) 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు 19 బంగారు,10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించారు .

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం విద్యార్ధినీ,విద్యార్థులను జింఖానా గ్రౌండ్ లో కలిసి అభినందించారు .
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ వారితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుని నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు .

ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు నిరంతరం వెన్నంటి నిలిచిన వారి కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు.స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version