21.12.2025
తాడేపల్లి
– జనం తలరాతలు మార్చే పాలన అందించిన నాయకులు వైయస్ జగన్ గారు
– అందుకే పార్టీ ఓడిపోయినా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు
: వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలు
తాడేపల్లి:
ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనం తలరాతలు మార్చే గొప్ప పాలన అందించిన గొప్ప నాయకులు వైయస్ జగన్ గారని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. అందుకే పార్టీ ఓడిపోయినా ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిగారు దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించిన అనంతరం ఈ వేడుకలను ప్రారంభించారు. పార్టీ నాయకులతో కలిసి భారీ కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే…
● ప్రతి కుటుంబం బాగుండాలని పాలన అందించారు
– సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్
కోట్లాది మంది తెలుగుప్రజల ఆరాధ్య నాయకులు, జననేత వైయస్ జగన్ గారి జన్మదిన వేడుకలు పార్టీకి పండగ రోజు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి చెప్పుకునే గొప్ప లక్షణాలున్న నాయకుడాయన. ఆయన వందేళ్లపాటు ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తమ పాలన ద్వారా జనం తలరాతలు మార్చే పాలన అందించిన
గొప్ప నాయకుల్లో దివంగత్ వైయస్సార్ గారి తర్వాత వైస్ జగన్ గారే గుర్తుకొస్తారు. కూటమి ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత తాము ఏం కోల్పోయామో రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్దిని ఐదేళ్లలో చేసి చూపించారు కాబట్టే పార్టీ ఓడిపోయినా ఆయనకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. తన పాలనలో నిస్వార్థంగా సేవలందించిన ఫలితమే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలే అజెండాగా పాలన అందించారు. ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి అందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన్ను ప్రజలు ఆరాధిస్తున్నారు.
పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఎన్నో అవరోధాలు, ఓటములు పలకరించినా చెక్కుచెదరని చిరునవ్వుతో ప్రజల ఆకాంక్షల సాధనే ఎజెండాగా వైయస్ జగన్ గారి నాయకత్వంలో వైయస్సార్సీపీ పోరాటాల చేస్తూ వస్తోంది. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూడలేదు. అధికారం ఇచ్చిన ప్రజల కోసం బాధ్యతగా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించిన నాయకులు దేశంలో వైయస్ తప్ప ఇంకొకరు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చేసేదే చెప్తాం.. చెప్పినవన్నీ చేస్తా అనేలా ముందుకుసాగారు.
చెప్పినవే కాకుండా ఎన్నో చెప్పని హామీలు కూడా తన పాలనలో అమలు చేసి చూపించారు. పార్టీని క్రమశిక్షణతో నడుపుతూ వస్తున్నారు. అందుకే వైయస్సార్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన తర్వాత రాష్ట్రానికి 225 సీట్లు వస్తాయి. అప్పుడు 200లకు పైగా సీట్లు గెలిచి మళ్లీ అధికారాన్ని చేపట్టి నేడు తిరోగమనంలోకి వెళ్తున్న రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోతారు.
● దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వైయస్ జగన్
– మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ
దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వైయస్ జగన్ మాత్రమే. తన ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలబడ్డారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేసి నిజమైన అర్థం చెప్పిన గొప్ప నాయకులు వైయస్ జగన్ గారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సేవలందించాలని రాష్ట్ర ప్రజంలందరి తరఫున కోరుకుంటున్నాను.
కార్యక్రమంలో వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతంరెడ్డి, పార్టీ బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు కొండమడుగుల సుధాకర్‌రెడ్డి,
పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి, పార్టీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, షేక్ ఆసిఫ్, గాదిరాజు సుబ్బరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




