టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్
యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తుంటే ఓర్వలేక జగన్ అండ్ కో విషం కక్కుతున్నారు
పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటి అంటూ వైసీపీ నేతలకు హైకోర్టు అక్షింతలేసినా సిగ్గు రాలేదు
గత 5 ఏళ్లు రాష్ట్రంలో భూకబ్జాలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసి నేడు భూముల గురించి మాట్లాడడం సిగ్గుచేటు
నాడు విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు వైసిపి నేతలు ఎవరెవరు ఎంత భూములు కబ్జా చేశారో ప్రజలకు తెలీదా?
భూముల కోసం నాడు వైసీపీ నేతలే ఒకరినొకరు తన్నుకున్న విషయం మర్చిపోయారా ?
భూకబ్జాల కోసం నాడు ఎంపీలు ఎంవిపి సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఒకరినొకరు కిడ్నాప్ చేసుకోలేదా?
విశాఖలో వందలాది ఎకరాలు విజయసాయి రెడ్డి తన కూతురు, అల్లుడికి దారాదత్తం చేయడం నిజం కాదా?
విజయసాయి రెడ్డి ఎక్కడ దాక్కున్న అతని అక్రమాలు బయటికి వస్తాయి
నాడు వైసిపి నేతలు విశాఖలో భేపార్కు, దసపల్లా భూములు ఎలా కొట్టేశారో విశాఖ ప్రజలకు తెలియదా?
ఉత్తరాంధ్రలో బాక్సైట్ , మోనోజైట్, లేటరైట్ అక్రమ తవ్వకాల కోసం వైసిపి నేతలు చేసిన సాహసాలు తెలీదా?
లాటరైట్ కోసం వైవి సుబ్బారెడ్డి మన్యం అడవుల్లో రాత్రికి రాత్రి రోడ్లు వేయించలేదా?
కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాడు అమర్ రాజా, ఇన్ఫోటెక్, లులు, కియా అనుబంధ పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసింది జగన్ కాదా?
నేడు చంద్రబాబు, లోకేష్ దేశ విదేశాలు తిరిగి నేషనల్, మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రానికి తెస్తుంటే వైసీపీ నేతలకు ఎందుకు అంత కడుపు మంట?
యువత ఇంకా గంజాయి, డ్రగ్స్ మత్తులోనే ఊగుతూ ఉంటే వైసీపీ నేతలకు ఆనందమా?
అక్కడుంది సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్… వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధిని అడ్డుకోవడం వారి తరం కాదు




