మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్ నిరంతర కృషి : ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ
ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పూర్తిచేసిన 3వ బ్యాచ్ ఎస్.హెచ్.జి మహిళలకు సర్టిఫికేట్లు అందజేత
సర్టిఫికెట్స్ అందుకున్న 45 మంది ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మహిళలు
కేశినేని ఫౌండేషన్ ద్వారా పొందిన శిక్షణతో జీవనోపాధి మెరుగుపర్చుకోవాలి.
మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన “ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త” అనే నినాదంతో స్పూర్తితో ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో మహిళల సాధికారత, గ్రామాల సమగ్ర అభివృద్ధి, మహిళల స్వాలంబనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ఆయన సతీమణి కేశినేని జానకి లక్ష్మీ అన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ , కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు జరిగిన 3వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పొందిన వారిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్.హెచ్.జి మహిళలు వున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ వారిని కలిసి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ 3వ బ్యాచ్ లో వర్మికంపోస్టింగ్, ప్రకృతి వ్యవసాయం, తేనే తయారీ పై ఐదు రోజుల పాటు ఎస్.హెచ్ .జి కి చెందిన 45 మంది మహిళలు శిక్షణ పొందారు. ఆ మహిళలందరితో జానకి లక్ష్మీ మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు. తమ జీవనోపాధి పెంచేందుకు ఇలాంటి అవకాశం ఇంతవరకు ఎవరు కల్పించలేదంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. తమకి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇప్పించిన కేశినేని ఫౌండేషన్ , ఎంపీ కేశినేని శివనాథ్ లను జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు.
ఈ సందర్భంగా కేశినేని జానకీ లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వతంత్రతే కుటుంబం, సమాజం ,రాష్ట్ర అభివృద్ధికి పునాది. ఎస్.హెచ్.జి మహిళలు స్వయం సమృద్ధి వైపు ధైర్యంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. . ఎన్.ఐ.ఆర్.డిలో నేర్చుకున్న నైపుణ్యాభివృద్ది శిక్షణను వినియోగించుకుని జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ఆకాంక్షించారు.
మహిళలు తల్చుకుంటే ఏమైనా సాధించగలరని, ముఖ్యంగా పొదుపు చేయటం తెలిసిన ఎస్.హెచ్.జి మహిళలు మరింత శక్తివంతులన్నారు. పొదుపు చేయటంలో విజయం సాధించిన మహిళలు, స్వయం ఉపాధి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎస్.హెచ్.జి అంటే కేవలం సేవింగ్స్ మాత్రమే కాదు…స్వయం సమృద్ది వైపు అడుగులు వేయటమన్నారు. కేశినేని ఫౌండేషన్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ నిలబెట్టే సంస్థగా కొనసాగటంతోపాటు, ఎల్లప్పుడూ అండగా, తోడుగా ఉంటుందన్నారు.
ఎన్.ఐ.ఆర్.డి శిక్షణ పొందిన మహిళలకు మండలాలకు వచ్చి కలుస్తానని…ఇక్కడ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోని ఇతర మహిళలకు నేర్పించి అందరూ కలిసి ఒక ప్రొడక్ట్ యూనిట్ నెలకొల్పాలన్నారు. యూనిట్ లో తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్, ప్రోఫెసర్స్ డాక్టర్ కతిరేషన్, ఎన్టీఆర్ జిల్లా రూరల్ ఎన్.ఐ.ఆర్.డి కో- ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ లతో పాటు కేశినేని ఫౌండేషన్ సిబ్బంది, ఎన్.ఐ.ఆర్.డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




