Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!! |

అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!! |

శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి పరుచుకున్న ఎత్తయిన కొండలు, లోయలు.. ఉదయాన్నే మంచు తెరలని చీల్చుకొని పలకరించే భానుడు. అబ్బా.. ఇలా ఒక్కటేంటి.. ఆ ప్రకృతి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. వాటికి మరింత వన్నె తెచ్చేలా ఇప్పుడు వలిసె పూలు కనువిందు చేస్తున్నాయి. పసుపు చీర కట్టుకున్న పెళ్లికూతురులా అరకులోయ ముస్తాబవుతుంది.

మంచు ముసుగులో కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రకృతికి పసుపు చీర కట్టినట్టు వలిసె పూల పూదోటలు మనసును కట్టిబడేస్తూ ఉంటాయి. మంచి కురిసే వేళలో మల్లె వెరిసేది ఎందుకో అని ఓ సినీ కవి రాసినట్టుగా.. అరకులో మంచు కురుస్తున్న వేళ ఈ వలిసె పూలు విరిసి అందరినీ తమ వైపు ఆకర్షిస్తాయి. తనివి తీర చూసి ఆస్వాదించాలని ఆహ్వానిస్తాయి. ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్, జనవరి వరకు ఈ వలిసె పూల సోయగాలు కనిపిస్తూ ఉంటాయి.

నవంబర్,డిసెంబర్ నెలలో ఈ పూల అందాలు మరింత వన్నె తెస్తాయి. పసుపు వర్ణంతో సింగారంలా ఆ లోయల అందాలను చెప్పతరం కాదు. ఈ సీజన్లో వలిసె పూల అందాలను చూసేందుకు విశాఖ మన్యానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. విదేశాల్లో ఉన్నట్టు.. మనసు దోచే ఈ పూలు పిల్లగాలులకు అటూ ఇటూ ఊగుతూ స్వాగతం పలుకుతుంటాయి. ఈ పసుపు పూల అందాలను బంధించడానికి కెమెరాలు కూడా పోటీ పడుతుంటాయి.

అందుకే.. ఈ కాలంనే ఇక్కడ సినిమా షూటింగులు కూడా నిర్వహించేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆసక్తి చూపుతుంటారు. చూసేందుకు అవి పొద్దుతిరుగుడు పూలుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందల ఏళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయని అంటున్నారు. ఇక్కడి అనుకూల వాతావరణంతో కొన్నేళ్ల క్రితం వరకూ ఎక్కడ చూసినా వీటి అందాలే కనువిందు చేశాయి.

అరుకు వ్యాలీ,పాడేరు ప్రాంతాల్లోనే 20 వేల ఎకరాల్లో ఈ వలిసె పూలు ఉండేవి. ఇప్పుడు 10 వేల ఎకరాల కంటే తక్కువకు సాగు పడిపోయింది. ఇంకా క్రమంగా తగ్గిపోతోంది. గిరిజన రైతులు గతంలో మాదిరిగా వలిసెల సాగుపై ఆసక్తి చూపించట్లేదు. రాజ్మా, పొద్దుతిరుగుడు లాంటి పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.

వలిసె గింజల ధర స్థిరంగా లేకపోవడం, విత్తనాల సమస్య, సస్యరక్షణ ఖర్చు అధికమవ్వడం, గింజలతో నూనె తయారీకి ఖర్చు పెరిగిపోవడం లాంటి కారణాలు గిరిజన రైతులను వలిసెల సాగు నుంచి దూరం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా వలిసె పైరును బంగారు తీగ అనే తెగులు పంటను దెబ్బతీస్తోంది. వలిసే పూల మకరందాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన తేనెటీగలను ఆకర్షిస్తూ.. తోటల మధ్యన డబ్బాలు పెట్టి తేనె కూడా ఉత్పత్తి చేస్తారు.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments