కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ).. 51 నాన్-టీచింగ్ పోస్టులను భర్తీచేయనుంది. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి.ఉద్యోగాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టుల్లో ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. గ్రూప్-బి, సి పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటాయి.
రాత పరీక్షలో అర్హత పొందినవారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.మొత్తం పోస్టుల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న గ్రూప్-బి, సి ఉద్యోగాల వివరాలు..సెక్షన్ ఆఫీసర్: ఏదైనా డిగ్రీ, మూడేళ్ల అనుభవం లేదా ఎల్‌డీసీగా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, నోటింగ్ డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు ఉండాలి.అసిస్టెంట్: డిగ్రీ, యూడీసీగా మూడేళ్ల అనుభవం ఉండాలి.
టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, నోటింగ్, డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు ఉండాలి.లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మూడేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.జూనియర్ ప్రోగ్రామర్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్.
లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్), రెండేళ్ల ప్రోగ్రామింగ్ అనుభవం ఉండాలి. సి/ సి++/ జావా లాంగ్వేజెస్, మైఎస్‌క్యూఎల్/ ఒరాకిల్ పరిజ్ఞానం ఉండాలి.అప్పర్ డివిజన్ క్లర్క్: డిగ్రీ, ఎల్‌డీసీగా రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.స్టెనోగ్రాఫర్: డిగ్రీ, ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు రాయగలగాలి.
ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు/ హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం.ముఖ్య అంశాలు:స్కిల్ టెస్ట్‌లో భాగంగా పది నిమిషాల డిక్టేషన్ ఇస్తారు. నిమిషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని..
దాన్ని 50 నిమిషాల్లో ఇంగ్లిష్‌లోకి, 65 నిమిషాల వ్యవధిలో హిందీలోకి ట్రాన్స్‌క్రిప్ట్ చేయగలగాలి.ఎంపికైనవారిని ఢిల్లీ, అమరావతి, ఐజ్వాల్, మిజోరం, కేరళ, జమ్మూలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.వయసు: యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 32 సంవత్సరాలు, మిగతా వాటికి 35 ఏళ్లు మించకూడదు.దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులు: జనరల్/ఓబీసీలకు రూ. 1500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు రూ. 750. గ్రూప్-బి పోస్టులు: జనరల్/ఓబీసీలకు రూ. 1000.
