పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్ ప్రమీల శుక్రవారం తెలిపారు.
అమ్మగారి పల్లి, కంభం వారి పల్లి, పుట్ట వారి పల్లి వద్దనున్న కోళ్ల ఫారాలలో ఈ మరణాలు సంభవించాయి. పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
# కొత్తూరు మురళి .