*రెండు చుక్కలు – జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు*
నర్సీపట్నం:
భవిష్యత్ తరాల ఆరోగ్య రక్ష కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని ఏపీ అసెంబ్లీ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్పీకర్ గారు ప్రారంభించగా, వారి సతీమణి, కౌన్సిలర్ పద్మావతి గారు చిన్నారులకు స్వయంగా చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ:
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 28,467 మంది (5 ఏళ్ల లోపు) చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు.
పోలియో చుక్కలు వందశాతం సురక్షితమని, ఎటువంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు.
పనులు ఉన్నా అశ్రద్ధ చేయకుండా, “రెండు చుక్కలు – జీవితాంతం రక్షణ” అని గుర్తించి, దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




