*21-12-2025*
ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి
పారిశ్రామివేత్తలకు, ప్రముఖులకు ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపు
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి విశిష్టసేవ పురస్కారం 2025 కార్యక్రమం
ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జిల్లాలోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. అంతే కాదు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ 4 కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని ప్రతి ఒక్కరూ ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి వందమంది ప్రముఖులకు విశిష్ట సేవ పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పీ 4 విధానం తీసుకొచ్చి పేదరికం లేని సమాజం నిర్మించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పి 4 కార్యక్రమం కింద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఆదర్శంగా తీసుకుని తను కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వందమంది మార్గదర్శకులు 1000 కుటుంబాలకు ఆదర్శంగా నిలబడటంతో పాటు వారిని దత్తత తీసుకొని వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.. డ్వాక్రా సంఘాలలోని మహిళలను కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో స్వయం ఉపాధి రంగంలో నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు.
విశిష్ట సేవలు చేసిన ప్రతి ఒక్కరు ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో కొండలన్నీ పచ్చదనంతో వుండటానికి కారణం మాజీ మేయర్ జంధ్యాల శంకర్ ఆనాడు కొండలపై విత్తనాలు చల్లించడమని గుర్తు చేశారు. ప్రముఖ విద్యావేత్త ఎం సీ దాస్ తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిలో చైతన్యం నింపారని పేర్కొన్నారు….
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రముఖులందరూ విద్యాభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలను దానం చేశారని తెలిపారు. కొంతమంది గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారన్నారు. 1995 వ సంవత్సరంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే శ్రమదానం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఒక నాయకుని పిలుపు సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు అధ్యక్షుడు సారేపల్లి శరత్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బొప్పన భవ కుమార్, త్రిశూల్ బసవేశ్వర రావు, డాక్టర్ సంకె విశ్వనాథ్, ఎంసీదాస్, యాంకర్ ఉదయభాను, ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ, జీవి రామారావు, సినీ నటుడు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు




