Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసంక్రాంతి ప్రత్యేక రైళ్లపై తాజా క్లారిటీ |

సంక్రాంతి ప్రత్యేక రైళ్లపై తాజా క్లారిటీ |

సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సారి ఏకంగా 600 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

త్వరలో పండుగ సీజన్ మొదలు కాబోతుంది. మరో ఐదు రోజుల్లో క్రిస్మస్ వస్తుండగా.. ఆ తర్వాత మరో ఐదు రోజుల్లో న్యూఇయర్ రాబోతుంది. ఇక ఆ తర్వాత మరో పది రోజుల్లో తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రానుంది. ఇలా వరుస పండగులు ఉండటంతో బస్సులు, రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరగనుంది

దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులను ప్రకటిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సులను ప్రకటించగా.. దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తోంది. ప్రత్యేక రైళ్లపై మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.

600 ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్ దృష్ట్యా ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, త్వరలో మరికొన్ని స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తున్నట్లు శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ పండుగల సీజన్‌లో మొత్తం 600 ప్రత్యేక ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, అనకాపల్లి, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు మార్గాల్లో నడపనున్నట్లు చెప్పారు. ప్రత్యేక రైళ్లల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం వల్ల ఇప్పటికే ఈ రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని, వెయిటింగ్ లిస్ట్‌ను బట్టి మరిన్ని రైళ్లను త్వరలో ప్రవేశపెడతామన్నారు. హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు 30 లక్ష్ మంది ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.  గత ఏడాది 500 వరకు ప్రత్యేక రైళ్లను నడిపామని, ఈ సారి వాటి సంఖ్య పెంచినట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ ప్రత్యేక రైళ్లు
ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. వేలకు వేలు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ సారి కూడా సంక్రాంతికి అదనపు బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ అదనపు బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నారు.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments