అమరావతి…
సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీయే 65 వ అధారిటీ సమావేశం
….నారాయణ,మంత్రి…*
అమరావతి లో క్వాంటం వ్యాలీకి సంబంధించి ఎక్విప్‌మెంట్ కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అధారిటీ నిర్ణయించింది*
సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి L1ని ఖరారు చేశారు*
ఈ ప్రత్యేక భవనం రెండు ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించబడుతుంది*
దీనితో పాటు క్వాంటం వ్యాలీలో మరో రెండు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు*
ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలకు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 109.52కోట్లు విడుదలకు ఆమోదం*
మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయాలకు అధారిటీ ఆమోదం తెలిపింది*
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆసుపత్రి, యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయం*
ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు*
అమరావతిలో వరద నివారణకు కొండవీటి వాగు , పాలవాగు , గ్రావీటి కెనాల్ తో పాటు ఆరు రిజర్వాయర్ లు ఇప్పటికే ప్రతిపాదించాం*
కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4వేల క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం*
ఇప్పడున్న పంపింగ్ సామర్ధ్యానికి అధనంగా మరో 8500క్యూసెక్కుల సామర్ధ్యం గల పంపింగ్ స్టేషన్ ను 443 కోట్లతో ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది*
LPS జోన్ 8లో 1351కోట్లుతో పనులు చేయించేలా అథారిటీ అప్రూవ్ చేసింది*
జరీబ్ ,నాన్ జరీబ్ ల్యాండ్స్ సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు ఆమోదం*




