కర్నూలు :
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది రోకలి బండతో వదినను కొట్టి చంపాడు. తెలిసిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన గంగావతి అనే మహిళ గత మూడు నెలల క్రితం తన భర్త అహోబిలాన్ని ప్రియుడితో కలిసి హత్య చేయించింది.
ఇటీవలే సబ్ జైలుకి వెళ్లి వచ్చిన ఆమె గ్రామంలోనే నివాసం ఉంటోంది. తన అన్నను చంపించినందుకు వదిన పై కక్ష పెంచుకున్న మరిది నిన్న ఆదివారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లి రోకలి బండతో కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




