మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ వాసుల జీవితాల్లో ఈ రోజు ఒక గుర్తుండిపోయే రోజు. గత 45 సంవత్సరాలుగా రైల్వే కల్వర్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో రూ.1.40 కోట్లతో రైల్వే కల్వర్టు మంజూరైంది.
ఈ శుభవార్త నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలిమెల మహేష్ ఆధ్వర్యంలో కొత్త బస్తీ వాసులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాకాలంలో నీటి సమస్యలు, రాకపోకల ఇబ్బందులు, అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే కష్టాలు ఇక ముగిశాయని బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
రైల్వే జనరల్ మేనేజర్ ని పలుమార్లు కలిసి సమస్యను వివరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చొరవ వల్లే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జావేద్, ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ మక్బూల్, మొహమ్మద్ ముక్తార్, సలీం, అజార్ మొహమ్మద్, సలీం తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
#sidhumaroju




