Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshదుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ |

దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ |

దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*

దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి శ్రీ టి.డి. జనార్దన్ మరియు విక్రమ్ పూల రూపొందించిన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకంతో పాటు దాని ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ, 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలనా సాగిందని చెప్పారు.

ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాలను, NTR భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసామని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్ పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని.

ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు పి.వి. రమణ మూర్తి, నల్లూరి శేషయ్య, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల విజయవంతంగా నిర్వహించారు.

అలాగే ఎన్‌ఆర్‌ఐ టీడీపీ – యూఏఈ కార్యవర్గానికి చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోతుకూరి, ఉపాధ్యక్షులు నిరంజన్ కాచర్ల, ప్రధాన కార్యదర్శి వాసు పొడిపి రెడ్డి, ట్రెజరర్ రాజా రవి కిరణ్ కోడి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ హరి కల్లూరి, మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ దారపనేని, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూధన్ కల్లూరి, మోహన్ మురళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments