*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*
*ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ ఎంపీటీసీ యల్లంపల్లి రత్నమ్మ వైసీపీ కి రాజీనామా.*
*అనేక మంది ఆమంచర్ల పంచాయతీకి చెందిన అప్పయకండ్రిగ, స్వర్ణ జ్యోతి నగర్, సేవజ్యోతి కాలనీ, మట్టెంపాడు, మన్నవరపాడు వైసీపీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.*
నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్యనేత గుడి మస్తానయ్య, ఆమంచర్ల మాజీ యంపిటీసీ యల్లంపల్లి రత్నమ్మ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు.
అందరం కలసికట్టుగా ఒక్కతాటిపై ఉండి, ప్రజలకు అందుబాటులో ఉందాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికి అండగా ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
భవిష్యత్తులో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, గెనేడి వెంకటేశ్వర్లు నాయుడు, మల్లినేని వేణు నాయుడు, జెడ్.పి. కో ఆప్షన్ మెంబెర్ అల్లాబక్షు, వాకా వెంకటేశ్వర్లు, నీటిసంసంఘం అధ్యక్షులు వేమినేని మురళీధర్, డేగా గంగాధర్, మల్లినేని వెంకట రమణమ్మ, గుడి రఘురామయ్య, బాబు, శీనయ్య, ప్రవీణ్, అచ్చి పుట్టయ్య, ప్రసాద్, పూనూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.






