Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneTelanganaనేటి రాశి ఫలాలు – 22 డిసెంబర్ 2025 |

నేటి రాశి ఫలాలు – 22 డిసెంబర్ 2025 |

*🌷రాశి ఫలితాలు🌷*
మేషం

భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం

రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

మిధునం

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

కర్కాటకం

దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది.

కన్య

బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల

ఋణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం

ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.

ధనస్సు

వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.

మకరం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కుంభం

ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

మీనం

కొన్ని వ్యాపావహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

🍁 శుభం భూయాత్ 🍀

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments