Home South Zone Andhra Pradesh పోలీస్ జీవితంలో నిజాయితీ అత్యంత కీలకం |

పోలీస్ జీవితంలో నిజాయితీ అత్యంత కీలకం |

0
0

ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_
*ఆకే.రవికృష్ణ ఐపిఎస్*
*ఐజిపి, ఏపీ ఈగల్ చీఫ్*

📍*స్థలం*: 6వ పఠాలం, మంగళగిరి.

*155 మంది SCT PCలు (APSP) కోసం నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్* కార్యక్రమం ప్రధాన అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి శ్రీ ఆకే.రవికృష్ణ ఐపీఎస్*.

నూతనంగా ఎంపికైన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ *జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు ఎప్పుడంటే – ప్రభుత్వ సేవలో అడుగు పెట్టిన రోజు*.

ట్రైనింగ్ అనేది అత్యంత కీలకమైన దశ అని తెలుపుతూ ఈ దశలో పొందే శిక్షణే మీ మొత్తం పోలీస్ జీవితానికి పునాది.

అనుభవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి – వాటికి అనుగుణంగా నవీకరించబడాలి.

జీవితంలో మనల్ని మనం ముఖ్యమైన ప్రశ్న ఒకటే వేసుకోవాలి:
మనము ఏ ఉద్యోగం చేస్తున్నాం? దాన్ని ఎంత నిజాయితీగా, ఎంత బాధ్యతగా చేస్తున్నాం?

మానవతా విలువలతో కూడిన పనులు నిశ్శబ్దంగా చేసే వారు కానిస్టేబుళ్లే.

దేవుడు మనకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. జీతం వస్తే, అదే జీతంతో గౌరవంగా జీవించాలి. అదే జీతంతో పొదుపు చేసుకోవాలి.

ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

మీరు చేసే చిన్న తప్పు కూడా మీ వ్యక్తిగత తప్పు కాదు, పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసిన తప్పుగా మారుతుంది. అందుకే ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండాలి.

ఒక చిన్న సూత్రం గుర్తుంచుకోండి:
అంకెల్లో చిన్న తేడా కూడా పెద్ద వ్యత్యాసాన్ని తీసుకువస్తుంది.
ప్రతిరోజూ మీరు 0.1 శాతం మెరుగుపడితే, ఒక సంవత్సరానికి మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఇది ఉద్యోగంలోనూ, జీవితంలోనూ వర్తిస్తుంది.

ఏపీఎస్పీలో ఉండటం మీ అదృష్టం. ఇది ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్. ఇక్కడి కానిస్టేబుళ్లు అత్యంత కష్టపడి, క్రమశిక్షణతో, అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఉద్యోగానికి న్యాయం చేయడమే మీ లక్ష్యం కావాలి.

అత్యధికమంది ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్లు, అవకాశాలతో చదువుకున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. సమాజానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం.

ఇక్కడితో ఆగిపోకండి.కష్టపడి ఉన్నత స్థాయిలకు చేరండి.
బెటాలియన్ ట్రైనింగ్‌ను

డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నేర నియంత్రణలో ముందుండాలని ఎస్పీ గారు సూచించారు.

ట్రైనీ కానిస్టేబుళ్లకు గౌరవ ఐజి గారు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి, స్నేహపూర్వక వాతావరణంలో మమేకమయ్యారు.”

NO COMMENTS