కర్నూలు : శని, ఆదివారాలు సెలవులు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వేలాది మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించి కృష్ణమ్మ ఒడిలో నదీ స్నానాలు చేసి పసుపు కుంకుమలతో సారెలు అర్పించారు.
దర్శనాలకు వీఐపీ టికెట్ దారులకు గంట, అతి శీఘ్ర, శీఘ్ర, ఉచిత దర్శనాలకు రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. సామాన్య భక్తులకు అధికారులు పాలు, మంచినీరు, అల్పాహారం, పిల్లలకు బిస్కెట్లు అందిస్తున్నారు. 300, 500 టికెట్లు పొందినవారికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు. సాయంత్రం ఆశీర్వచన మండపంలో ఉత్సవ పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు.




