కర్నూలు :
ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కోల్ కతాలో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ఎజెండా లేదని స్పష్టం చేశారు. బీజేపీతో పోల్చడం పెద్ద పొరపాటని అన్నారు.
నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన స్వయం సేవకులను తయారు చేయడమే సంఘ్ లక్ష్యమని తెలిపారు. పేదల అభ్యున్నతి, సనాతన సంస్కృతి పరిరక్షణ, స్వదేశీ ప్రోత్సాహం ద్వారా బలమైన దేశ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. సంఘ్ ను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరమని భాగవత్ పేర్కొన్నారు.




