రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుమోలు విజయకుమార్ గౌడ్* రాజ్యాధికార పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా తెనాలికి చెందిన అనుమోలు విజయకుమార్ గౌడ్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ,తాడేపల్లి లో మీడియా సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు.
జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగోని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికార పార్టీ గ్రామీణ ప్రాంతం నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని బడుగు బలహీన వర్గాల సమస్యలపై ,నిరుద్యోగులు ,ఉద్యోగులు, రైతు ,మహిళ ,యువత ,అభివృద్ధిపై ,వారి సమస్యలపై పోరాటం చేస్తుందని, నూతన అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్
సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని విస్తృతపరచాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు వారికి, మరియు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని తెలియజేశారు.



