Home South Zone Andhra Pradesh గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా |

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా |

0
0

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కార్మికుల ఆవేదన బయటపడింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శూన్యం కల్పిస్తున్నారని* ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ.

కనీస జీతభత్యాలు లేకుండా *ఉచితంగా* పనిచేయాల్సి వస్తోందని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. పండుగలు వస్తున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా జీవనం గడపాల్సి వస్తోందని. *పిల్లలకు కొత్త బట్టలు* కొనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేసిన పనికి తగిన జీతాలు ఇవ్వాలని.

కనీసం పండుగలకైనా జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది.

NO COMMENTS