కర్నూలు : నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట విద్యా,ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నియమించిన సందర్భం గా వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ,క ర్నూలు జిల్లా కలెక్టరేట్ సర్కిల్ నందు గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు పాల్గొన్నారు.




