కర్నూలు :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 84 ఫిర్యాదులు **ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని
…1) కర్నూలు, ఎల్ పేట దగ్గర వంశీ హోమ్స్ లో ఉన్న కంసాలి కార్తీక్ అనంతపురం, బెంగళూరు, కర్నూలు లలో పలువురు ఉద్యోగులను మంచి స్నేహితులుగా చేసుకుని వారి కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకుని వారి అవసరాన్ని బట్టి హైదరాబాదు యాక్సిస్ బ్యాంకు లో పనిచేస్తున్న తన స్నేహితుడి ద్వారా క్రెడిట్ కార్డు లోన్స్, బిజినెస్ లోన్స్, గోల్డ్ లోన్స్ వారికి వచ్చే జీతం కంటే ఎక్కువ లోన్ అమౌంట్ ఇప్పిస్తానని ఒకేసారి పలు బ్యాంకులలో రుణాలు మంజూరు చేయించి పలు రకాలుగా మోసాలకు పాల్పడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడని కర్నూలుకు చెందిన 5 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.
2) మా పొలంను రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్ చేయిస్తామని , పొలం డాక్యుమెంట్లు తీసుకొని ఎమ్మిగనూరు కు చెందిన సుధాకర్ శెట్టి రూ. 5 లక్షల 95 వేలు తీసుకొని మోసం చేశాడని , దేవనకొండ మండలం , నెలిబండ గ్రామంకు చెందిన ఆదినారాయణ ఫిర్యాదు చేశారు.
3) నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, నన్ను చూసుకోకుండా, నాకు ఎలాంటి జీవనాధారం లేకుండా చేశారని న్యాయం చేయాలని ఎమ్మినూరు కు చెందిన ఎల్లప్ప ఫిర్యాదు చేశారు.
4) నా తమ్ముని కుమారుడు మహబూబ్ బాషా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మా ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నo చేస్తున్నాడని కర్నూలు , ఖండేరి వీధికి చెందిన హుస్సేన్ బి ఫిర్యాదు చేశారు.
5) నా పొలంలోకి నన్ను పోనీయకుండా నా పై దాడి చేసిన ఇద్దరి పై చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించాలని ఆదోని, పెద్ద తుంబలంకు చెందిన ఖయ్యూం ఫిర్యాదు చేశారు.
6) నాకు తెలియకుండా మా ఇంటి పై లోన్ తీసుకున్న చింతల వెంకట రాముడు పై , రుణం మంజూరు చేసిన ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు మహాత్మానగర్ కు చెందిన పెద్ద వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు
.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.




