Home South Zone Andhra Pradesh రంపచోడవరంలో నారా భువనేశ్వరి పర్యటన |

రంపచోడవరంలో నారా భువనేశ్వరి పర్యటన |

0
0

అల్లూరి సీతారామరాజు జిల్లా**:

రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన.

రంపచోడవరంలో భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.

యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి.

వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మెగా వైద్య శిబిరానికి భారీగా తరలి వచ్చిన స్థానికులు.

అందరి వద్దకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న భువనేశ్వరి.

మొత్తంగా12 రకాల సేవలను ప్రారంభించిన భువనేశ్వరి.

అనంతరం న్యూట్రిఫిల్ ద్వారా జీవన శైలి, హైజీన్, డయాబెటిస్ వంటి అంశాలపై డాక్టర్లతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి.

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన భువనేశ్వరి.

వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భవనేశ్వరి.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు.

*ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ…*

రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తోంది.

అన్న ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారు.

ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలనే ట్రస్టును ఏర్పాటు చేశారు.

చంద్రబాబు అనుకున్న విధంగానే నేను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నా.

వైద్య సేవలు, విద్యా, మహిళా సాధికారతకు ఆలోచనలు చేసి అందుకు తగ్గ సాయం అందిస్తున్నాం.

గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు
రంపచోడవరంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం.

ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం.

ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు మందుకొచ్చి సహకారం అందిస్తున్నారు.

ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించాం.

22.64 లక్షల మంది వైద్య సేవలు పొందారు.

రూ.22.97 కోట్ల విలువైన మందులను ప్రజలకు పంపిణీ చేశాం.

మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాం

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నాం.

2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన అవసరాలు తీర్చుతూ యూనిఫాం
అందించాం.

పేద పిల్లకు రూ.3.50 కోట్లు స్కాలర్షిప్పులను అందించాం.

మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు అందించాం.

వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకులు ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించాం.

ఇదంతా ప్రజలు, దాతల సహకారంతోనే సాధ్యమైంది.

ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకొస్తున్నారు.

పేదల కోసం ట్రస్ట్ ఖర్చు చేస్తున్న నిధులకు దాతలు సహకారం అందిస్తున్నారు.

దాతలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం.

NO COMMENTS