*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు…*
ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తెనాలికి చెందిన అనుమోలు విజయ్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం జాతీయ అధ్యక్షులు నారగోని చేతుల మీదగా విజయ్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
అనంతరం నారగోని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజా సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో పార్టీని విస్తృతపరచాలని సూచించారు.
నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ బలోపేతం చేయడానికి అందరిని కలుపుకొని తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియమాకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు నారగోని కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*






